సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులను మోసం చేసింది జగన్ కాదా అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాచర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఎకరాకు నీరు ఇవ్వలేదని జగన్ పై ఫైర్ అయ్యారు. హంద్రీనీవా ప్రాజెక్టులో నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు అంటూ పేర్కొన్నారు రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదని ఆ ప్రాంతాలను తీర్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని తెలియజేసారు.