పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉన్న పాంచాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తో పాటు మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ను, పాచిపెంటలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యా శిక్షణ సంస్థ అధ్యాపక బృందం ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డైట్ అధ్యాపకులు శేషాద్రి సోమయాజులు, ఎన్ తిరుపతిరావు పరిశీలకులుగా తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్ లను పరిశీలించారు. పాంచాలి జెడ్పీ హైస్కూల్లో బాలికల టాయిలెట్ల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని వంటగ్యాస్ తో కాకుండా కట్టెలతో వండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.