జిల్లా వ్యాప్తంగా సాగుచేసిన పంటల కనుగుణంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందని ముందస్తుగా కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు పడతానేమోనన్న ఆందోళన రైతులకు అవసరం లేదని కలెక్టర్ చేతన్ తెలియజేశారు. పుట్టపర్తి కలెక్టర్ రేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 5.5 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. సెప్టెంబర్ నెల మొత్తం కంటిన్యూగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా సరఫరా చేస్తామన్నారు. అదేవిధంగా శాస్త్రీయంగా ఏ పంటకు ఎంత యూరియా అవసరమో రైతులు గుర్తించాలని అధికంగా యూరియా వాడకం వల్ల భూమి దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.