జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల కేంద్రంలోని ఎరువుల దుకాణానికి రైతులు బారులు తీరారు సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు క్యూ లైన్ లో వేచి చూస్తూ ఎరువులు తీసుకునేందుకు ఎగబడ్డారు కేంద్రానికి కేవలం 200 యూరియా బస్తాలు దిగుమతి అయిన విషయం తెలుసుకున్న వెంటనే సమీప ప్రాంతాల రైతాంగం అక్కడికి చేరుకొని బారులు తీరారు దీంతో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని వరుస క్రమంలో ఉంచారు.