ప్రకాశం జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడి అసభ్యకర వీడియోలు వైరల్ కావడంతో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి 7 గంటలకు ఓ వీడియోను విడుదల చేశారు. 'జనసేన పార్టీ యువ నేత అసభ్య పదజాలంతో మహిళలను దుర్భాషలాడిన వీడియోలు బుధవారం సాయంత్రం నుంచి వైరల్ గా మారాయి. ఆ నాయకుడిని పార్టీకి కొంతకాలం దూరం ఉంచుతున్నాం. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం' అని ఆయన పేర్కొన్నారు.