పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఫీజు దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు,లవ కుమార్,సుమ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం దారుణం అన్నారు.రేవంత్ రెడ్డి సర్కార్ మద్యానికి ఇస్తున్న విలువ విద్యారంగానికి ఇవ్వడం లేదన్నారు.వెంటనే 8158 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని,నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలనే డిమాండ్ చేశారు