అల్లూరి జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి సచివాలయ పరిధిలో రేషన్ స్మార్ట్ కార్డులను పెస కమిటీ మండల సహాయ కార్యదర్శి పాలికి లక్కు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాంగెడ్డ, ఓనూరు, దారెలబంద, గుర్రాగరువు, మోదపల్లి గ్రామాలకు చేరుకున్న ఆయన స్థానిక గిరిజనులకు రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తూ అక్కడి సమస్యలతో కూడిన వివరాలను మీడియాకి ప్రకటన రూపంలో వెల్లడించారు. గ్రామానికి సరైన రహదారి లేదని స్మార్ట్ కార్డులు ఇచ్చి ఏం లాభం అంటూ ఆయన ప్రకటనలో తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా సరైన రహదారి నిర్మించాలని ఆయన కోరారు.