ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏటూరునాగార ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఏఎస్పీ వివరాలు.. అనిల్ నాయక్ అనే వ్యక్తి తనకు సెక్రటేరియట్లో అధికారులతో పరిచయం ఉన్నాయని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని వెంకటాపురంలో నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షల నగదు తీసుకొని మోసం చేశాడన్నారు. కాగా, నేడు వెంకటాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.