శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకి సమీపంలోని సోమవారం సాయంత్రం పెద్ద వంక వద్ద విద్యుత్ స్తంభం ప్రమాదవశాత్తు విరిగిపోవడంతో వైర్లు వేలాడుతున్నాయి. ఆ ప్రాంత ప్రజలు వెంటనే గోరంట్ల సీఐ శేఖర్, విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన విద్యుత్ శాఖాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లే విద్యుత్ సరఫరాను ఆపివేశారు. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.