వ్యాధులను సకాలంలో నిర్ధారణ చేయాలని జిల్లా ఎన్.సి.డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. కొమరాడ మండలంలో కోటిపాం, గంగరేగువలస గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కోటిపాం లో నిర్వహించిన సంచార చికిత్సా వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. రోగులకు చేపట్టిన ఆరోగ్య తనిఖీలు,వైద్య పరీక్షల వివరాలు రికార్డులో పరిశీలించారు.రోగులు తెలిపిన ప్రతీ సమస్యనూ స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. జ్వర వివరాలపై ఆరా తీసి నిర్ధారణ పరీక్షల కిట్లు,స్లైడ్స్ పరిశీలించారు.క్షేత్ర స్థాయిలో జ్వర నిర్ధారణ తక్షణమే జరగాలని ఆదేశించారు.