పాణ్యం మండలం తమ్మరాజుపల్లె కొండల్లో ఫారెస్ట్ పరిసరాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గురువారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులేకుండానే మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తూ రూ.లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలిపారు. రోజూ 10 హిటాచీలు, 50 టిప్పర్లతో గ్రావెల్ నంద్యాలకు తరలింపుతో రూ.లక్షల ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం, అధికారులు మౌనంగా ఉండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.