సూర్యాపేట జిల్లా: ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు ఆదివారం అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 25 వ వార్డులో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందన్నారు.