ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలైన ఘటన ఏటూరునాగారంలో గురువారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాలు.. గంటలకుంటకు చెందిన ముగ్గురు గుత్తికోయలు చిన్నబోయినపల్లి నుంచి ఏటూరునాగారం వైపు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో రహదారి మూలమలుపు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, అటుగా వెళుతున్న ఎస్సై రాజుకుమార్ బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.