తిరుపతి యశోద నగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శనివారం అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో హాస్టల్ యాజమాన్యం చుట్టుపక్కల వెతికి విచారించగా ఎక్కడ కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు అదృష్టమైన విద్యార్థులు షేక్ హర్షదాలి చిట్టి బోయిన సాయికుమార్ గురు బాలాజీ గా పోలీసులు గుర్తించారు. ఆచూకీ తెలిసినవారు అలిపిరి పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.