తిరుపతి జిల్లా నాయుడుపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జూనియర్, సీనియర్ బాలబాలికల టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. జిల్లాలోని పలు విద్యాసంస్థల నుండి 50 మంది బాల బాలికలు ఈ ఎంపికలో పాల్గొన్నారు. ఈ ఎంపికలు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు డా.బండి శ్యాంసుందరరావు, సెక్రటరీ గెరిటి చెంచయ్య, ఉపాధ్యక్షులు పైడి కోటేశ్వరరావు, కె.మల్లికార్జున, ఈసి మెంబెర్స్ చాట మునిరాజ, అరుణకుమార్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని యన్. మంజుల, నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎ.నాగూరయ్య, సెక్రటరీ బట్టా సుబ్రహ్మణ్యం,