రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో దుస్తులు లేకుండా ఎక్స్ రే రూములో పడుకొన్న ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ తెలిపారు. ఆసుపత్రిలో రేడియోలజీ ఉద్యోగి ఉదంతం మంగళవారం మద్యాహ్నం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రెండుసార్లు మెమోలు ఇచ్చి జీతం కోత విధించినా అతనిలో మార్పు రాలేదని అన్నారు. అతని రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని ఉన్నతాధికారులకు నివేదించామని వెల్లడించారు.