భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితుల్లో ప్రజల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన మెటపిప్రి, సాంగ్వి గ్రామాలను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, వరదలు తగ్గేంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అత్యవసర సహాయం కోసం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.