ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రదానరహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కలలోడుతో వెళ్తున్న హైచర్ లారీ క్రింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్పారు. మోటార్ సైకిల్ పై వెళ్తున్న కూనాలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) తీవ్రగాయాలు పాలై మృతి చెందాడు.