ఐరాల మండలంలోని కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం బలిజ కులస్తులు ఉభదారులుగా జరుపు అశ్వవాహన సేవ కార్యక్రమంలో భాగంగా ఉదయం కలశ పూజ నిర్వహించారు.ఈశ్వరుని దేవస్థానంలో కలశాలకు పూజలు నిర్వహించి ఊరేగింపు స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ పెంచల కిషోర్,చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఎ ఎస్ మనోహర్,టిడిపి నాయకులు కాజూరు బాలాజీ,ఉభయదారులు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.