నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో జిల్లాలోని వాగు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల కోసం జనం పరుగులు పెట్టారు. చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.