జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల పురగతి పై సమీక్షించారు. అనంతరం అక్కరాజుపల్లి గ్రామపంచాయతీలోని PHC సబ్ సెంటర్ ను తనిఖీ చేసి రికార్డులు రోగి సేవలు ఇతర సౌకర్యాలను పరిశీలించారు.