వివిధ శాఖల సమన్వయంతో రాయదుర్గం పట్టణంలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, సిఐ జయానాయక్, తహసీల్దార్ నాగరాజు కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభం మెదలు నిమజ్జనం వరకు తగిన జాగ్రత్తలు, నియమనిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జనం రోజు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారులు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, డిఈ సురేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.