బందరు పోర్టును పూర్తి సామర్థ్యంతో నిర్మిస్తాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్తానిక మచిలీపట్నం పోర్టును పూర్తి సామర్థ్యం గల పోర్టుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గురువారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమృత్ 2.0 పథకం కింద 47 అభివృద్ధి పనులకు కేంద్రం వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.