కొరిశపాడు మండలంలో ఆయా గ్రామాలలో ఈనెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాంబాబు శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. నిర్దేశించిన తేదీలలో రైతులు ఆయా గ్రామాలలో తమ పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని అన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాలు తగ్గు ముఖం పట్టడం, సొంగ కారటం వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్ రాంబాబు తెలియచేశారు. ముందస్తు నివారణకు రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆయన కోరారు.