ఓర్వకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కురువ చిన్న స్వాములు ఇటీవల గొర్రెలు కాయడానికి వెళ్తు పాము కాటుకు గురై మృతి చెందాడు. టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్నందున భార్య కురువ లక్ష్మీదేవికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం మంజూరు అయింది. శనివారం నాడు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఓర్వకల్లు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు.