విజయనగరం జిల్లా రామభద్రపురం మండల పరిధిలోని తారాపురంలో విషాదం నెలకొంది.. గ్రామానికి చెందిన 41 ఏళ్ల ఒంటరి మహిళ తుమరాడ శ్యామల గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఏఎస్ఐ అప్పారావు తెలిపారు. గురువారం తెల్లవారుజామున పురుగుమందు తాగిన ఆనవాళ్లను గుర్తించామన్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.