రాజంపేట ఆర్టీసీ డిపోలో ఈనెల 14వ తేదీన రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలు వాహనాలు పట్టబడ్డాయని చెప్పారు ఆరోజు ఉదయం 10 గంటలకు జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనాలని కోరారు.