రాష్ట్రంలో చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులు పొందుట కోసం స్మార్ట్ రైస్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్ , సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి పెనమలూరు నియోజకవర్గం లోని పోరంకి బిజేఆర్ నగర్ లో లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి వారికి స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రివర్యులు పోరంకి డీలర్ సిహెచ్ దుర్గారాణి చౌక దుకాణాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న స్టాకు వివరాలను పరిశీలించారు.