నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో ఆదివారం ఐదు గంటల సమయంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకేఎస్)జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి భగవంతుడు అధ్యక్షత వహించారు.ముఖ్యఅతిథిగా అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రాము హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని అన్నారు.కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సి ఉన్న యూరియ 9.80 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా 5.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని అన్నారు.ఇకనైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే రైతులకు యూరియా సరఫర చేయాలని కోరారు.