అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ వద్ద బుధవారం నిర్వహించనున్న సూపర్ హిట్ రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవ సభ కార్యక్రమానికి 55 ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ జగదీష్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు నిఘా పెట్టారు. ఈ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో సభ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం చేశారు. సీసీ కెమెరాల ప్రత్యేక అధికారిగా డిఐజి సత్య యేసు బాబును నియమించారు.