తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో ఆదివారం తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు తనిఖీలు నిర్వహించారు. లాడ్జి యాజమాన్యంతో మాట్లాడి రూములలో బస చేస్తున్న వారి వివరాలు ఆరా తీశారు. కస్టమర్ల నుంచి తప్పకుండా ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని సూచించారు. ఎవరి మీదయినా అనుమానం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లాడ్జిని ఎస్సై కొండపనాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జిలో బస చేస్తున్న వారి వివరాలను ఆరా తీశారు.