గతంలో ఎన్నడూ లేనివిధంగా వినాయక చవితి ఉత్సవాలకు వేసే పందిళ్లకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించే చర్యలు చేపట్టడం ఆనందదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం రాజమండ్రిలో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు వినాయక చవితి మొదలుకొని మహాశివరాత్రి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ఉత్సవ కమిటీలు ఈ అవకాశాన్ని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.