సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఎం ఆర్ హెచ్ ఎస్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను సిఐ. శివలింగం, ఎంపీడీవో మహేందర్ రెడ్డిలు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడలను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యతోపాటు ఆటల పోటీలు కూడా అవసరమన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం బయటపడుతుందన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయికి ఎంపిక చేయనున్నారు.