భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం సరస్సు నీటిమట్టం 30 అడుగులకు గాను 25 అడుగులకు చేరుకోవడంతో మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గణప సముద్రం చెరువు కింద సుమారు 3 వేల ఎకరాల పంటలు పండించేందుకు గణపసముద్రం నీరు ఎంతో ఉపయోగపడుతుందని, బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తెలిపారు.