శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల తపాలా కార్యాలయంలో చోరీ ఘటన వెలుగు చూసింది శుక్రవారం పోస్ట్ మాస్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు తపాలా కార్యాలయం మెయిన్ డోర్ తాళం పగలగొట్టి లాకర్లో ఉన్న రూ.1,24,500 రూపాయల నగదును చోరీ చేసినట్టుగా గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. డి.ఎస్.పి శివ నారాయణస్వామి ఘటన స్థలాన్ని పరిశీలించారు.