ఏలూరు జిల్లా పెదపాడు సొసైటీ వద్ద ఎరువుల పంపిణీ ప్రక్రియను శనివారం సాయంత్రం పెదపాడు SI కే.శారద సతీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై సొసైటీ CEO సుబ్బారావును పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఉన్న వ్యవసాయ భూమిని బట్టి వారికి ఎరువులు కేటాయించడం జరుగుతుందని సుబ్బారావు SIకి చెప్పారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖీ అయ్యారు. అవకతవకలు లేకుండా యూరియా పంపిణీ జరుగుతున్నట్లు SI తెలిపారు.