వెంకటేశ్వరపురంలోని షబ్బీర్ నివాసంలో ఈనెల 20న చోరీ జరిగింది. ఇంట్లోనే బీరువాలో ఉన్న పది సవర్ల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన నవాబుపేట పోలీసులు, అరవ సుబ్రహ్మణ్యం అనే నిందితుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి పది సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని, తాము గస్తీ నిర్వహిస్తామని సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.