కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సెకండ్ ఏఎన్ఎం, 104 ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేందుకు గత ఏడాది డిసెంబర్ 29న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 104 ఉద్యోగుల ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.