నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయిందని ఎస్పీ జానకి షర్మిల ఆదివారం అన్నారు. బైంసా నిర్మల్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అందరి సహకారంతో నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసామని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో కష్టపడి విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.