అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పూజల్లో అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొని హారతులు ఇచ్చి ప్రసాదం స్వీకరించారు. సమిష్టిగా జరుపుకున్న ఈ వేడుక పోలీసు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని బలపరిచింది.