తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పెళ్లకూరు మండలం వర్ధమాల గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే వర్ధమాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు గమనించి 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి తరలించారు