భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ ధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంచాలంటూ ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని లాటిఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు అంబాల చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మాట్లాడుతూ వృద్ధులకు వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలంటూ ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు తమపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎస్పీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.