నల్లగొండ జిల్లా :నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు డ్యామ్ లోని అన్ని క్రస్ట్ గేట్లను మంగళవారం మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 51,735 క్యూసెక్కులు,ఔట్ ప్లో 51,635 క్యూసెక్కులుగా నమోదయిందన్నారు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 585.75 అడుగులుగా ఉందని పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 299.4545 టీఎంసీలు నీటి నిలువ ఉండగా పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉన్నట్లు తెలిపారు.