రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని ఎమ్మెల్సీ కుంభా రవికుమార్, టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. మంగళవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రైతులు సకాలంలో యూరియా అందక అవస్థలు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం అన్యాయం అన్నారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు.