గుత్తి మండలం అబ్బే దొడ్డి జడ్పీ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పని చేస్తున్న శ్రీనివాసులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. శ్రీనివాసులు 1996లో ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. 15 సంవత్సరాల పాటు డిజిటల్ పద్ధతిలో తరగతులు బోధిస్తున్నాడు. రిసోర్స్ పర్సన్ గా కూడా పనిచేస్తున్నారు. ఈనెల ఐదో తేదీన విజయవాడలో జరుగునున్న టీచర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీనివాసులు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీనివాసులును గురువారం ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.