Araku Valley, Alluri Sitharama Raju | Sep 13, 2025
అరకులోయ నియోజకవర్గం పెదబయలు మండలం జామిగూడా పంచాయతీ కేంద్రంలో 15 గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు శనివారం ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని వీరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.