పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంగళవారం శక్తి టీం సభ్యులు ఎల్. శ్రీనివాసరావు, నిర్మల తదితరులు ఈవ్ టీజింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు డ్రగ్స్, పోక్స్ యాక్ట్, సైబర్ క్రైమ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. నేరాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.