మంగపేట మండలంలోని గౌరారం వాగు పరిధిలోని బొమ్మయిగూడెం గ్రామంలో సర్వేకు వెళ్లిన అధికారులు వాగు ఉధృతి కారణంగా చిక్కుకుపోయారు. దీంతో స్థానిక గిరిజనులు సదరు అధికారులను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగు దాటించారు. గిరిజనులకు మంజూరైన ఇందిరా సౌర గిరిజల పథకంలో భాగంగా బోర్లు వేసేందుకు సర్వే కోసం వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.