మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ, కవులు, కళాకారులు తమ రచనలను ప్రజలకు చేరువయ్యేలా రాయాలని సూచించారు. ఆదివారం సంగారెడ్డిలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో పాక రాజమౌళి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఎంతోమంది ఉపాధ్యాయుల మధ్య గడపడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన ధర్మాన్ని కాపాడే సాహిత్యాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.