జిల్లాలోని తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో మహిళ నదిలోకి దూకడాన్ని గమనించిన మత్స్యకారుడు సదరు మహిళను గమనించి కాపాడి ఒడ్డుకు చేర్చాడు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ భవానీ పురానికి చెందిన మహిళగా గుర్తించారు. మహిళను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.